అక్షరటుడే, బాన్సువాడ: బీర్కూరు మండలం బరంగేడిగి గ్రామంలోని డబుల్ బెడ్ రూమ్ కాలనీలో ఓ ఇంటికి ఆనుకుని విద్యుత్ తీగలు ప్రమాదకరంగా ఉన్నాయి. అక్కడే ఓ చెట్టు ఏపుగా పెరిగి వైర్లకు తగులుతోంది. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. చెట్టును తొలగించాలని అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పేర్కొంటున్నారు. ప్రాణాలు పోతేనే స్పందిస్తారా అంటూ అధికారులపై మండిపడుతున్నారు.