అక్షరటుడే, జుక్కల్‌: మోతాదుకు మించి ఎరువులు వాడకుండా రైతులు భూసారం కాపాడుకోవాలని ఏడీఏ ఇంద్రసేన సూచించారు. ప్రపంచ మృత్తిక దినోత్సవం సందర్భంగా నిజాంసాగర్‌ మండలంలోని వడ్డేపల్లి రైతువేదికలో గురువారం అన్నదాతలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పచ్చిరొట్ట, సేంద్రియ ఎరువుల వాడకంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏవో అమర్‌ ప్రసాద్, ఏఈవో సాగర్, ఏఎంసీ డైరెక్టర్‌ రాజారాం, రైతులు పాల్గొన్నారు.