అక్షరటుడే, ఇందూరు: జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డికి గురువారం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు స్వాగతం పలికారు. జిల్లా కేంద్రంలోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో కలెక్టర్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్, అదనపు డీసీపీ కోటేశ్వరరావు, ఆర్డీవో రాజేంద్రకుమార్, ఏసీపీ రాజా వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.