అక్షరటుడే, వెబ్ డెస్క్: రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి గణనీయంగా తగ్గింది. పారిశ్రామిక ఉత్పాదకలో క్షీణత ఇందుకు కారణంగా తెలుస్తోంది. రెండో త్రైమాసికం వివరాలను తాజాగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ఈ సంవత్సరం రెండో త్రైమాసికంలో 5.4% వాస్తవ జీడీపీలో వృద్ధి ఊహించిన దాని కంటే తక్కువగా ఉంది. పారిశ్రామిక వృద్ధిలో క్షీణత ఇందుకు దారితీసింది. తయారీ కంపెనీల పనితీరు తగ్గడం, మైనింగ్ కార్యకలాపాల్లో తగ్గుదల, తక్కువ విద్యుత్ డిమాండ్ కారణం. కాగా.. వ్యవసాయ వృద్ధికి ఆరోగ్యకరమైన ఖరీఫ్ పంట ఉత్పత్తులు కాస్త మద్దతునిచ్చాయి.” అని వివరించారు.