అక్షరటుడే, వెబ్డెస్క్: సిరియా దేశంలో సంక్షోభం మరింత ముదురుతోంది. తిరుగుబాటు దళాలు ఆ దేశంలోని కీలక నగరాలను ఆక్రమించుకుంటున్నాయి. ఈ క్రమంలో భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. ఆ దేశంలో ఉన్న భారత పౌరులు వెంటనే వీడాలని సూచించింది. అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో సిరియాకు వెళ్లొద్దని పేర్కొంది.