అక్షరటుడే, వెబ్‌డెస్క్: తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఆయన ఎక్స్‌లో ట్వీట్ చేశారు. సంవత్సరం పాలన ఎంతో సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గొప్ప లక్ష్యాల వైపు విరామం లేకుండా ముందుకు సాగిపోతున్నామన్నారు.