అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: మలయాళ నటుడు జయరాం తనయుడు, యాక్టర్ కాళిదాస్‌ వివాహం కేరళలోని గురువాయూర్‌ శ్రీకృష్ణ మందిర్‌లో ఆదివారం జరిగింది. మోడల్‌ తరుణిని పెళ్లి చేసుకున్నారు. కాళిదాస్‌, తరుణి కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. పెద్దల అంగీకారంతో ఇప్పుడు ఒక్కటయ్యారు. పెళ్లి ఫోటోలను కాళిదాస్‌ సోషల్‌ మీడియాలో పంచుకోగా.. అభిమానులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.