అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం 107 పాయింట్ల నష్టంతో 81,602 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్.. కొద్దిసేపటికే 81,781 పాయింట్లకు పెరిగి, 81,411 పాయింట్లకు పడిపోయింది. 44 పాయింట్ల నష్టంతో 24,633 పాయింట్ల వద్ద ప్రారంభమైన నిఫ్టీ.. ఇంట్రాడేలో 24,705 పాయింట్లకు పెరిగి, 24,580 పాయింట్లకు దిగజారింది. ఉదయం 11:45 గంటల ప్రాంతంలో సూచీలు ఫ్లాట్ గా కదలాడుతున్నాయి. నిఫ్టీ ఫిఫ్టీలో ఎల్టీ, ఎస్బీఐ లైఫ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, కోటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, అదానీ పోర్ట్స్ లాభాల బాటలో పయనిస్తుండగా టాటా కన్స్యూమర్, హెచ్యూఎల్, దివిస్ ల్యాబ్, హిందాల్కో, బ్రిటానియా, నెస్లే, ఆసియన్ పెయింట్, హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టపోతున్న జాబితాలో ఉన్నాయి.