అక్షరటుడే, ఆర్మూర్: కాంగ్రెస్ ప్రభుత్వం బీడీ కార్మికులందరికీ ఆంక్షలు లేకుండా రూ.4016 జీవనభృతి ఇవ్వాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ముత్తన్న డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం మున్సిపల్ కమిషనర్ రాజుకు వినతిపత్రం అందజేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీడీ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎండీ నజీర్, తూర్పాటి శ్రీనివాస్, లావణ్య, లక్ష్మి, మంజుల, రిషిత, మానస తదితరులు పాల్గొన్నారు.