అక్షరటుడే, వెబ్‌డెస్క్: పుష్ప-2 మూవీ విడుదలైన మొదటి రోజు నుంచే కలెక్షన్ల పరంగా సంచలనాలు సృష్టిస్తోంది. కేవలం 4 రోజుల్లోనే రూ.829 కోట్లను కలెక్టు చేసిన తొలి ఇండియా సినిమాగా నిలిచింది. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. బాలీవుడ్‌లోనూ 4 రోజుల్లో రూ.291 కోట్లకు పైగా కలెక్షన్లతో దూసుకుపోతోంది.