అక్షరటుడే, బోధన్: రోగులకు మెరుగైన వైద్యసేవలందించాలని వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ సూచించారు. శనివారం ఆయన ఆస్పత్రిలోని మౌలిక వసతులను పరిశీలించారు. అలాగే రోగులను పలకరించి సరైన వైద్య సేవలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. వైద్యులందరూ సమయపాలన పాటించాలని ఆదేశించారు. వేసవి ఎండలు మండుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆస్పత్రిలో మందులు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఆయన వెంట బోధన్ జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ రాహుల్, డాక్టర్లు రహీం, సిబ్బంది తదితరులున్నారు.
రోగులకు మెరుగైన వైద్యసేవలందించాలి
Advertisement
Advertisement