అక్షరటుడే, ఇందూరు: రాష్ట్ర ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన మల్లారెడ్డిని రాష్ట్ర సైక్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విజయ్ కాంత్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర సంఘానికి ఎన్నికైన సందర్భంగా అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఒలింపిక్ సంఘం మాజీ కార్యదర్శి జగదీష్ యాదవ్, సాఫ్ట్ బాల్ రాష్ట్ర కార్యదర్శి శోభన్ బాబు, మనోహర్ కుమార్, రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.