అక్షరటుడే,నిజామాబాద్ సిటీ: టీఎన్జీవోస్ భీమ్‌గల్ నూతన కార్యవర్గం ఎన్నికైంది. బుధవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి నూతన అధ్యక్ష, కార్యదర్శులను ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా బొంపల్లి సృజన్‌కుమార్, కార్యదర్శిగా ఎనుగందుల గంగాజమున, సహాధ్యక్షుడిగా కుంట శ్రీనివాస్‌రెడ్డి, ఉపాధ్యక్షులుగా నరేశ్, రవిని ఎన్నుకున్నట్లు జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్‌కుమార్ తెలిపారు.