అక్షరటుడే, ఇందూరు: ఒలింపిక్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నిజామాబాద్‌కు చెందిన ఈగ సంజీవ్‌రెడ్డి ఎన్నికయ్యారు. అసోసియేషన్ ఎన్నికలు గతంలో నిర్వహించగా కోర్టు ఉత్తర్వుల మేరకు ఫలితాలను బుధవారం ప్రకటించారు. ఇందులో నగరంలోని బోర్గాం(పి)కి చెందిన ఈగ సంజీవరెడ్డి ఉపాధ్యక్షుడిగా ఎన్నికవగా.. ఈసీ మెంబర్‌గా జిల్లాకు చెందిన అంద్యాల లింగన్న గెలుపొందారు.