అక్షరటుడే, బాన్సువాడ: క్రీడల వల్ల మానసిక ప్రశాంతతో పాటు శారీరక దారుఢ్యం పెరుగుతుందని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్ అన్నారు. గురువారం వర్నిలో సీఎం కప్ క్రీడా పోటీల ముగింపు కార్యక్రమంలో మాట్లాడారు. గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్రీడా పోటీలను నిర్వహిస్తోందన్నారు. అనంతరం క్రీడల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ సురేష్ బాబా, జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఖలేక్, యూత్ కాంగ్రెస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, నేమాని వీర్రాజు, మన్సూర్, సాయిలు, కిషన్ శంషోద్దీన్, మారుతి తదితరులు పాల్గొన్నారు.