అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: సినీ నటుడు అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై మీడియా చిట్‌చాట్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి స్పందించారు. చట్టం తన పని చేసుకుపోతుందని వ్యాఖ్యానించారు. ఇందులో తన జోక్యం ఏమీ ఉండదని తెలిపారు. చట్టం ముందు అందరూ సమానులేనని పేర్కొన్నారు. పుష్ప-2 మూవీ ప్రీమియర్‌ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒకరు మృతిచెందిన నేపథ్యంలో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.