అక్షరటుడే, ఆర్మూర్‌: ఆర్మూర్ – అరుణాచలం ప్రత్యేక బస్సును శుక్రవారం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ లో డీఎం రవికుమార్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్తులు కోరితే మరిన్ని బస్సులు నడుపుతామని పేర్కొన్నారు. శబరిమలకు సైతం అయ్యప్ప స్వాములు బస్సు సర్వీసును బుక్‌ చేసుకోవచ్చని చెప్పారు. కార్యక్రమంలో ఎస్టీఐ పారు, ఎంఎఫ్‌ గంగాకిషన్, డీవీఎస్‌ చక్రవర్తి, అశోక్, గంగాధర్‌ పాల్గొన్నారు.