అక్షరటుడే, నిజాంసాగర్: మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలను శనివారం ఎంఈవో అమర్‌సింగ్ తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న బ్రేక్‌ఫాస్ట్‌ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థినులతో మాట్లాడి మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు.