అక్షరటుడే ఇందూరు: ప్రభుత్వం నూతన పీఆర్సీని అమలు చేసి, పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు మాడవేడి వినోద్ డిమాండ్ చేశారు. శనివారం నగరంలోని కేర్ డిగ్రీ కళాశాలలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని పేర్కొన్నారు. బీసీటీయూ సభ్యత్వ నమోదును ప్రారంభించారు. అనంతరం ఆయా మండలాల కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రవి కుమార్, రామకృష్ణ, గౌరవాధ్యక్షుడు బాబు, రమణస్వామి, ఆయా మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు.