అక్షరటుడే, ఆర్మూర్ : ఆలూరు మండలంలోని రాంచంద్రపల్లిలో శనివారం సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో నాయకులు ఆర్మూర్ ఏరియా రాజకీయ శిక్షణ తరగతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ముందుగా పార్టీ జెండా ఆవిష్కరించి, అమరులకు నివాళులర్పించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు పెద్ది వెంకట్రాములు, కొండ గంగాధర్, డివిజన్ కార్యదర్శి వెంకటేష్, జిల్లా కార్యదర్శి లింగం, ఎల్లయ్య, భూమన్న, అశోక్, సాయిలు, బండారి ఎల్లయ్య, ఓంకార్, రఫీ, గణేష్, పద్మ పాల్గొన్నారు.