అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: పోలీస్ స్టేషన్లో న్యూసెన్స్ చేసిన నిందితుడు దిలీప్ కు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు టూ టౌన్ ఎస్‌హెచ్‌వో తెలిపారు. నగరంలోని బురుడుగల్లికి చెందిన దిలీప్ జులాయిగా తిరుగుతూ డబ్బుల కోసం వేధించడంతో తల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నిందితుడిని స్టేషన్ కు తరలించగా కత్తితో మెడ, ఛాతిపై గాయాలు చేసుకుని న్యూసెన్స్ చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. కాగా.. న్యాయస్థానం నిందితుడికి రిమాండ్ విధించింది. దిలీప్‌పై ఇదివరకే పలు కేసులు నమోదై ఉన్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.