అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: నగరంలోని బాపూజీ వచనాలయ అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యేలు సుదర్శన్‌ రెడ్డి, ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా అన్నారు. నూతనంగా ఎన్నికైన బాపూజీ వచనాలయ కమిటీ సభ్యులు శనివారం ఇద్దరు ఎమ్మెల్యేలను కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా వచనాలయ అభివృద్ధికి సహకరించాలని కోరగా.. అన్నివిధాల తోడ్పాటునందిస్తామన్నారు. కార్యక్రమంలో అధ్యక్షుడు భక్తవత్సలం, కార్యదర్శి సుధాకర్‌ రావు, కోశాధికారి గంగాధర్‌ రావు, ఉపాధ్యక్షుడు దేవిదాస్, సంయుక్త కార్యదర్శి సాంబయ్య, సభ్యుడు అమందు విజయ్ ఇతర సభ్యులు పాల్గొన్నారు.