అక్షరటుడే, వెబ్ డెస్క్: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఏకకాలంలో 19 మందికి జైలు శిక్ష పడింది. రెండ్రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ.. ఆర్మూర్ కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. ఆర్మూర్ సబ్ డివిజన్ పరిధిలోని 10 పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో మొత్తం 256 మంది పట్టుబడ్డారు. వీరిలో 19 మందికి రెండ్రోజుల చొప్పున జైలు శిక్ష పడింది. మిగితా వారికి రూ.4.43 లక్షల జరిమానాలు విధించారు.