అక్షరటుడే, బిచ్కుంద: పత్తిలోడుతో వెళ్తున్న టాటా ఏస్ వాహనం జాతీయ రహదారి 161పై అదుపుతప్పి బోల్తా పడింది. మద్నూర్ లోని సీసీఐ కొనుగోలు కేంద్రానికి వెళ్తుండగా మేనూరు వద్ద వాహనం బోల్తా కొట్టింది. వెంటనే స్పందించిన జాతీయ రహదారి పెట్రోలింగ్ సిబ్బంది జేసీబీ సహాయంతో వాహనాన్ని తొలగించారు. వాహనం జుక్కల్ మండలం విఠల్ వాడి గ్రామానికి చెందినదిగా స్థానికులు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Parthi Gang | హైవేలే టార్గెట్.. దారి దోపిడీలకు పాల్పడుతున్న పార్థీ గ్యాంగ్ అరెస్ట్​