అక్షరటుడే, బాసర: బాసర ట్రిపుల్‌ఐటీలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పీయూసీ సెకండియర్ చదువుతున్న బుచ్చుక అరవింద్ సోమవారం రాత్రి హాస్టల్‌లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. విద్యార్థి స్వస్థలం సిద్దిపేట జిల్లా తొగుట మండలం బండారుపల్లి. అరవింద్ మృతదేహాన్ని నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హాజరుశాతం తక్కువగా ఉండడంతో ఈ నెలలో జరిగే పరీక్షలకు అధికారులు అనుమతించబోరనే భయంతో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది.