Advertisement

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ :

Advertisement
తెలంగాణ భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్‌ అందించింది. తెలంగాణలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫార్సు లేఖలు వారానికి రెండు సార్లు అనుమతించాలని టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించకపోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. శ్రీవారి సన్నిధిలోనే తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధులు టీటీడీ బోర్డు తీరును విమర్శించారు. తిరుమలలో తెలంగాణ భక్తులను చిన్నచూపు చూస్తున్నారని.. తమకు కూడా విలువ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో టీటీడీ సమావేశమైంది. ఇక నుంచి వారానికి రెండు సార్లు తెలంగాణ ప్రజాప్రతినిధులతో సిఫార్సు లేఖలు అనుమతించాలని నిర్ణయించినట్లు శుక్రవారం ప్రకటించింది. దీంతో సిఫార్సు లేఖలతో వెళ్లే భక్తులకు ప్రయోజనం చేకూరనుంది.

ఇది కూడా చ‌ద‌వండి :  Tirumala | తిరుమలలో అక్రమ నిర్మాణాలపై హైకోర్టు సీరియస్