Advertisement

అక్షరటుడే, కోటగిరి : అదుపుతప్పి లారీ బోల్తా పడిన ఘటన పోతంగల్ మండలం కల్లూర్ శివారులో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర నుంచి మాగి షుగర్ ఫ్యాక్టరీకి చెరుకు లోడ్ తో వెళ్తున్న లారీ కల్లూర్ వద్ద శుక్రవారం రాత్రి అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో లారీడ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రుడిని అంబులెన్స్ లో బోధన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement