Advertisement

అక్షరటుడే, నిజాంసాగర్: టైరు పేలి డివైడర్ ను కారు ఢీకొట్టిన ఘటన నిజాంసాగర్ మండలం వెల్గనూరు శివారులో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. బెంగళూరుకు చెందిన ఓ కుటుంబం మహారాష్ట్రలోని నాందేడ్ కు సంగారెడ్డి – నాందేడ్ జాతీయ రహదారిపై వెళ్తుండగా.. వెల్గనూరు శివారులో కారు టైరు పేలి డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. జాతీయ రహదారి సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Union Minister | కేంద్ర మంత్రి కారుకు ప్రమాదం