Advertisement
అక్షరటుడే, వెబ్‌డెస్క్: తిరుమలలో తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలు అనుమతించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు అంగీకరించారని టీటీడీ ఛైర్మన్ బీఆర్‌నాయుడు తెలిపారు. సోమవారం సీఎం చంద్రబాబుతో ఆయన సమావేశమయ్యారు. వారానికి రెండు బ్రేక్ దర్శనం, రెండు రూ.300 దర్శనానికి సంబంధించిన నాలుగు సిఫార్సు లేఖలు అనుమతించేందుకు సీఎం ఆమోదించారని ఆయన చెప్పారు.
Advertisement