Advertisement

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : విద్యాసంస్థలు ప్రతి ఏడాది ఫీజులు పెంచాలనుకోవడం సమంజసం కాదని విద్యా కమిషన్‌ ఛైర్మన్‌ ఆకునూరి మురళి అన్నారు. ఫీజుల నియంత్రణ కోసం చట్టం తీసుకురావాలని ప్రభుత్వానికి తాము సిఫార్సు చేస్తామని తెలిపారు. ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం అధికారాలతో కూడిన ఒక ప్రత్యేక వ్యవస్థ ఉండాలన్నారు. మాతృ భాష నేర్చుకోవాలి గానీ..మాతృ భాషలోనే బోధన అంటే కరెక్ట్‌ కాదని ఆయన పేర్కొన్నారు. నేషనల్‌ ఎడ్యుకేషనల్‌ పాలసీలో కొన్ని మంచి అంశాలున్నాయని, స్కూల్లోకి కూడా ఎఫ్డీఐలు వస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామని తెలిపారు. స్కూళ్లను కేటగిరీలుగా విభజిస్తామని.. వారంలో ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని చెప్పారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Sri Chaitanya | శ్రీచైతన్య విద్యాసంస్థల్లో రెండో రోజు ఐటీ సోదాలు