అనుమతుల్లేకుండా అడ్మిషన్లు.. అల్‌ఫోర్స్‌ కళాశాల సీజ్‌!

0

అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్‌: అనుమతులు లేకుండా అడ్మిషన్లు తీసుకుంటున్న నగరంలోని అల్‌ఫోర్స్‌ కళాశాలను ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారులు సీజ్‌ చేశారు. విశ్వశాంతి జూనియర్‌ కాలేజీ కేంద్రంగా ఈ కళాశాల అడ్మిషన్లను తీసుకుంటోంది. దీంతో అఖిల భారత విద్యార్థి సంఘం(ఏఐఎస్‌ఏ) నాయకులు డీఐఈవోకు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయన అల్‌ఫోర్స్‌ కాలేజీ ఆఫీస్‌రూంను సీజ్‌ చేశారు. కళాశాల పేరిట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను సైతం తొలగించారు. అంతేకాకుండా అనుమతులు లేకుండా అల్‌ఫోర్స్‌ కళాశాల పేరిట ప్రచారం చేస్తూ.. అడ్మిషన్లు తీసుకుంటున్న విశ్వశాంతి కాలేజీ అనుమతులను సైతం రద్దు చేయాలని విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి జ్వాల, తదితరులు పాల్గొన్నారు.