Advertisement

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: సివిల్ సప్లయ్స్ హమాలీ కార్మికులు గురువారం మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. నిరవధిక సమ్మెలో భాగంగా రెండో రోజు నిజామాబాద్ మండల ఎంఎల్ఎస్ పాయింట్ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య మాట్లాడుతూ.. హమాలీ కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలన్నారు. రేట్ల పెంపు జీవోను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హమాలీల సమ్మెకు కుకింగ్ గ్యాస్ ఏజెన్సీ వర్కర్స్ యూనియన్ నాయకుడు హనుమాన్లు, బీడీ వర్కర్స్ ఫెడరేషన్ నాయకుడు భానుచందర్ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యదర్శి దేవేందర్, కైసర్, నాగరాజ్, జావీద్, రాజు, వాజిద్, చంద్రమ్మ, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  TGS RTC | ఆర్మూర్ నుంచి ధర్మపురికి ప్రత్యేక బస్సులు