Advertisement
అక్షరటుడే, ఎల్లారెడ్డి: లింగంపేటలోని కస్తూర్బా పాఠశాలతో పాటు ఎస్సీ హాస్టల్‌ను ఎంఈవో షౌకత్ అలీ శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న వసతులు, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. సిలబస్ ఎంత వరకు పూర్తయిందని అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ హాస్టల్ విద్యార్థుల కోసం వేడి నీటి వసతి కల్పించామని, దుప్పట్లు, స్వెటర్లను అందించినట్లు తెలిపారు.
Advertisement