బాన్సువాడ, అక్షరటుడే: బాన్సువాడ నియోజకవర్గానికి అండగా ఉంటానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భరోసా ఇచ్చారు. పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మాట్లాడారు. నియోజకవర్గానికి బీఆర్ఎస్ ప్రభుత్వం సంవత్సరానికి రూ.1,000 కోట్లు నిధులు కేటాయించిందని, పార్టీకి అండగా ఉండాల్సిన సమయంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ ప్రజలకు, పార్టీకి ద్రోహం చేశారన్నారు. పార్టీ మారి ఆరు నెలలు అవుతున్నా.. నియోజకవర్గానికి పోచారం ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా 11 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించామని గుర్తుచేశారు. బాన్సువాడను బంగారువాడగా మార్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమని పేర్కొన్నారు. ఆటో వాళ్లకు సంవత్సరానికి రూ.12 వేలు ఇచ్చే బాధ్యతను స్థానిక ఎమ్మెల్యే పోచారం తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతకుముందు మహిళలు మంగళ హారతులు, బతుకమ్మ, బోనాలు, డప్పు వాయిద్యాలతో.. గులాబీ శ్రేణులు గజమాలతో కవితకు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్, జడ్పీ మాజీ ఛైర్మన్ దఫెదార్ రాజు, మున్సిపల్ వైస్ ఛైర్మన్ జుబేర్, మోచి గణేష్, ఎర్రవాటి సాయిబాబా, రమేష్ యాదవ్, గౌస్, సూరి పాల్గొన్నారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : Rajiv Yuva Vikasam : రాజీవ్ యువవికాసం పథకానికి అప్లై చేసిన వారికీ భట్టి గుడ్ న్యూస్..!
Advertisement