అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: సంక్రాంతి వేడుకల్లో భాగంగా సోమవారం హైదరాబాద్ లో నిర్వహించిన భోగి సంబరాల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా భోగి మంటల కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్నారులకు భోగి పండ్లు పోయడంతో పాటు ముగ్గులు వేశారు. అనంతరం కవిత మాట్లాడుతూ తెలుగు ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పండుగకు ఎంతో విశిష్టత ఉందన్నారు. ప్రజలు సంతోషంగా వేడుకలు జరుపుకోవాలని పేర్కొన్నారు.