అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: మాజీ మంత్రి కేటీఆర్‌పై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్మూర్లో తనపై జరిగిన దాడి వెనుక కేటీఆర్ హస్తం ఉందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో త్వరలో బీఆర్ఎస్ భూస్థాపితం అవుతుందని ఎంపీ వ్యాఖ్యానించారు. నిజామాబాద్ ప్రజలు కవిత చాప్టర్ క్లోజ్ చేశారని, తెలంగాణ ప్రజలు కేటీఆర్‌ను కూడా సాగనంపుతారని ఆయన పేర్కొన్నారు. తాజాగా ఆయన ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో ఈ మేరకు వ్యాఖ్యలు చేయగా.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  MLC Kavitha | లింగంపేట ఘటనపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత