అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: మూవీ ప్రమోషన్‌లో భాగంగా ఓ హీరోయిన్‌పై దర్శకుడు అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ‘మజాకా’ సినిమా టీజర్‌ రిలీజ్‌ ఫంక్షన్‌ హైదరాబాద్‌లో జరిగింది. అయితే స్జేజీపై దర్శకుడు త్రినాథరావు హీరోయిన్‌ అన్షుపై జగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారు. “మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మన్మథుడు సినిమాలో హీరోయిన్ గా నటించింది. అప్పట్లో బొద్దుగా ఆకట్టుకున్న అమ్మాయి ఇప్పటికీ అలాగే ఉంది. కొంచెం సన్నబడింది. నేనే చెప్పా.. కొంచెం తినిపెంచమ్మ.. తెలుగుకు అన్ని కొంచెం ఎక్కువ సైజులోనే ఉండాలని చెప్పా..” అని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.

Advertisement

38 ఏళ్ల వయసులో హీరోయిన్‌గా..

నాగార్జున మన్మథుడు సినిమాలో అలరించిన అన్షు అంబానీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. 38 ఏళ్ల వయసులో హీరోయిన్ గా మజాకా సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు త్రినాథరావు దర్శకత్వం వహిస్తున్నారు. మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్లో డైరెక్టర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

Advertisement