రైలు కిందపడి ఒకరి సూసైడ్!

0

అక్షరటుడే, వెబ్ డెస్క్: నిజామాబాద్ శివారులోని మాధవ నగర్ రైల్వే గేట్ సమీపంలో ఓ వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. మంగళవారం సాయంత్రం ఇంటర్ సిటీ రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అనంతరం రైల్వే స్టేషన్ ఎస్సై సాయి రెడ్డి రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. మృతుడు ఆర్యనగర్ ప్రాంతానికి చెందిన రాజవరపు శ్రీనివాస్ గా గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులతో సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోందని ఎస్సై తెలిపారు. మరోవైపు మృతుడి భార్య వరలక్ష్మి 2020లో హత్యకు గురైంది. శ్రీనివాస్ వద్ద మేస్త్రీలుగా పనిచేసే వారే ఆమెను హతమార్చారు. అప్పట్లో ఈ ఘటన కలకలం సృష్టించింది. తాజాగా శ్రీనివాస్ సూసైడ్ చేసుకోవడం చర్చకు దారితీసింది.