Advertisement
అక్షరటుడే, వెబ్‌డెస్క్: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం అర్ధరాత్రి సైఫ్ ఇంట్లోకి చొరబడ్డ దుండగుడు కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. నిందితుడిని పట్టుకోడానికి ముంబయి పోలీసులు పది బృందాలు ఏర్పాటు చేసి గాలించారు. ఎట్టకేలకు దాడికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకోని బాంద్రా పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నట్లు తెలిసింది. కాగా ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ సైఫ్ అలీఖాన్ ప్రస్తుతం కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు.
Advertisement