Advertisement

అక్షరటుడే, వెబ్ డెస్క్: హైదరాబాద్ హబ్సిగూడలో విషాదం చోటుచేసుకుంది. నాచారం పోలీస్ స్టేషన్ పరిధి హబ్సిగూడ సైంటిస్ట్ కాలనీలో విద్యుదాఘాతంతో ఇద్దరు కూలీలు మృతి చెందారు. ఓ చిట్ ఫండ్ కంపెనీకి సంబంధించి హోర్డింగ్ దించేందుకు బాలు(37) కూలికి వచ్చాడు. సహాయం కోసం రామంతాపూర్ లో ఉన్న మల్లేశ్(29)ను వెంట తెచ్చుకున్నాడు. ఇద్దరు కలిసి రెండో అంతస్తులోని హెూర్డింగ్ ను దింపేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో హోర్డింగ్ జారి అక్కడే ఉన్న 11 కేవీ విద్యుత్ తీగలపై పడడంతో ఇద్దరికి షాక్ తగిలి అక్కడికక్కడే మరణించారు. ఘటనాస్థలికి పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు. ఇద్దరి స్వస్థలం సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి మండలం, జైన్ గూడగా గుర్తించారు. మృతులను గాంధీ హాస్పిటల్ కు తరలించారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Bodhan | విద్యుదాఘాతంతో ఒకరి మృతి