Advertisement

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ఏపీ టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డిపై నటి మాధవీలత ఫిర్యాదు చేసింది. జేసీ తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారంటూ ఆమె హెచ్‌ఆర్సీ, పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌లో కూడా ఫిర్యాదు చేయగా ట్రెజరర్‌ శివబాలాజీ స్పందించారని.. “మా” అధ్యక్షుడు మంచు విష్ణు దృష్టికి తీసుకెళ్లారని పేర్కొంది. నూతన సంవత్సర వేడుకలపై మాధవీలత కామెంట్‌ చేయగా.. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆమెపై అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే..

Advertisement