Advertisement

అక్షరటుడే, ఇందూరు: మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం శనివారం మేయర్ నీతూకిరణ్ అధ్యక్షతన ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎంఐఎం కార్పొరేటర్లు వీధి వ్యాపారులు, తోపుడు బండ్ల వ్యాపారులను రోడ్లపై నుంచి తరలించవద్దని.. ఈ అంశాన్ని ఎజెండాలో పెట్టాలని సూచించారు. ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తాతో పాటు బీజేపీ కార్పొరేటర్లు కలగజేసుకొని వీధి వ్యాపారులకు ప్రత్యామ్నాయ స్థలాలను కేటాయించి ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు. దీంతో ఇరు పార్టీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

ఎంఐఎం కార్పొరేటర్ల నిరసన

నగరంలో మాస్టర్ ప్లాన్ అమలు చేసిన తర్వాతే వీధి వ్యాపారులు, తోపుడు బండ్లను తొలగించాలని మేయర్ ఛాంబర్ ఎదుట ఎంఐఎం కార్పొరేటర్లు నిరసన తెలిపారు. మేయర్, మున్సిపల్ కమిషనర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీధి వ్యాపారులకు మద్దతుగా జీవో విడుదల చేయాలని, అప్పటివరకు వాళ్లను కదిలించొద్దని డిమాండ్ చేశారు.

Advertisement