Advertisement

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: కేంద్ర ప్రభుత్వ టెలీకాం శాఖ స్పామ్ కాల్స్‌ అరికట్టడానికి యాప్‌ రూపొందించింది. స్పామ్‌, ఫేక్‌ కాల్స్‌తో ప్రజలు ఇబ్బందులు పడుతుండడంతో పాటు పలువురు సైబర్ నేరాలకు గురవుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని టెలికాం శాఖ సంచార్‌ సాథీ(sanchar saathi) అనే యాప్‌ తయారు చేసింది. ఈ యాప్‌ డౌన్లోడ్‌ చేసుకుని రిజిస్టర్‌ చేసుకుంటే మోసపూరిత, అనుమానిత కాల్స్‌ నుంచి రక్షణ పొందవచ్చు. అవసరం లేని ఫోన్లు, మెసేజ్లను నిరోధించవచ్చు. స్పామ్‌ కాల్స్‌ వచ్చినప్పుడు ఈ యాప్‌ ద్వారా ఫిర్యాదు కూడా చేయవచ్చు.

Advertisement