అక్షరటుడే, బాన్సువాడ: తప్పులు లేకుండా సర్వే చేపట్టాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. చందూర్ మండల కేంద్రంలో రైతు భరోసా, రేషన్ కార్డుల సర్వేను సోమవారం ఆయన పరిశీలించారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు తెలుసుకున్నారు. ప్రతి రైతుకు సంబంధించిన వివరాలు, రేషన్ కార్డులో మార్పులు చేర్పులు, కొత్త కార్డులు అవసరమైన వారి వివరాలను నమోదు చేయాలని సూచించారు. మండల స్థాయి అధికారులు సర్వేను ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Ration Cards | రేషన్ కార్డులపై కీలక అప్​డేట్​.. మూడు రంగుల కార్డులను అందించనున్న ప్రభుత్వం