Advertisement

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: అండర్‌-19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ జైత్రయాత్ర కొనసాగుతోంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకను భారత్‌ 60 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. దీంతో టోర్నీలో భారత్‌ మూడో విజయాన్ని నమోదు చేసింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా 20 ఓవర్లలో 118/9 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్‌ బౌలర్ల ధాటికి శ్రీలంక 20 ఓవర్లలో 58/9 పరుగులకు పరిమితమైంది.

Advertisement