అక్షరటుడే, జుక్కల్‌: నిజాంసాగర్‌ మండలంలోని గోర్గల్‌ పంచాయతీ కార్యాలయం ఎదుట ఉపాధి హామీ కూలీలు మంగళవారం నిరసన తెలిపారు. తమకు ఉపాధి పని కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఉద్దేశపూర్వకంగా ఉపాధి హామీ పనులను నిలిపివేశారంటూ పంచాయతీ కార్యదర్శితో వాగ్వాదానికి దిగారు. వెంటనే తమకు ఉపాధి కల్పించాలని వారు కోరారు.