అక్షరటుడే, ఎల్లారెడ్డి: గిరిజనుల అభివృద్ధికి కృషి చేసేది మోదీ ప్రభుత్వమేనని బీజేపీ మధ్యప్రదేశ్‌ ఇన్‌చార్జి మురళీధర్‌ రావు అన్నారు. గాంధారిలో మంగళవారం నిర్వహించిన జహీరాబాద్‌ పార్లమెంట్‌ గిరిజన మోర్చా సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. తెలంగాణకు ములుగు జిల్లాలో గిరిజన యూనివర్సిటీని ఇచ్చిన ఏకైక ప్రభుత్వం బీజేపీ అని పేర్కొన్నారు. గిరిజనులు ఆర్థికంగా, విద్యాపరంగా ఎదగాలని యూనివర్సిటీని మంజూరు చేసినట్లు వివరించారు. దేశం మోదీ చేతిలో ఉంటేనే సురక్షితంగా ఉంటుందని పేర్కొన్నారు. పదేళ్లలో దేశం ప్రపంచానికే ఒక దిక్సూచిగా మారుతుందని గుర్తుంచుకోవాలన్నారు. బీజేపీ పాలనలో ఎక్కడా బాంబు బ్లాస్టులు జరగలేదని, ప్రజలు సుఖంగా నిద్రపోయేందుకు నరేంద్ర మోదీ నిద్రలేకుండా కృషి చేస్తున్నారని తెలిపారు. జహీరాబాద్‌లో బీబీ పాటిల్‌ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్‌ పార్లమెంట్‌ ప్రబారి పెద్దోళ్ల గంగారెడ్డి, మాజీ మంత్రి నేరెళ్ల ఆంజనేయులు, బాణాల లక్ష్మారెడ్డి, ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కళ్యాణ్‌ నాయక్‌, జిల్లా మోర్చా అధ్యక్షుడు రవి పాల్గొన్నారు.