అక్షరటుడే, వెబ్‌డెస్క్ : దేశంలో మరో కొత్త వైరస్ కలకలం రేపుతోంది. మహారాష్ట్రలో గులియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) కేసులు నమోదు అవుతుండటం ఆందోళన కల్గిస్తోంది. ఈ వైరస్‌తో పుణేకు చెందిన ఓ వ్యక్తి మరణించాడు. ఇప్పటి వరకు అక్కడ 101 మందికి ఈ వైరస్ సోకినట్లు మహారాష్ట్ర వైద్య శాఖ తెలిపింది. ఇందులో 16 మంది వెంటీలెటర్‌పై చికిత్స పొందుతున్నారు.
రోగ నిరోధక శక్తిపై దాడి
అరుదుగా సోకే జీబీఎస్ వైరస్ చాలా ప్రమాదకరం. ఇది నేరుగా రోగ నిరోధక శక్తిపై దాడి చేసి మనిషిని బలహీనం చేస్తుంది. దీంతో నరాల బలహీనత, పక్షవాతం వచ్చే అవకాశం ఉంది. ఈ వైరస్ సోకిన వారు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతారు. ఈ వ్యాధికి చికిత్స లేదు. కోలుకోవడానికి చాలా కాలం పడుతుంది. కేసులు నమోదు అవుతుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.