Advertisement

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : ఉత్తరాదిలో వాయుకాలుష్యం తీవ్రత కొనసాగుతోంది. గాలి నాణ్యతా దారుణంగా పడిపోయింది. ఈనేపథ్యంలో పొగమంచు దట్టంగా కమ్ముకోవడంతో బుధవారం ఢిల్లీ – మీరఠ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేపై పదుల సంఖ్యలో వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈప్రమాదంలో ఆరుగురు గాయపడగా.. సమీపంలో ఆస్పత్రికి తరలించారు. హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు చర్యలు చేపట్టారు. ప్రమాద స్థల దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. పొగమంచు కారణంగా ఢిల్లీలో బుధవారం గాలి నాణ్యతా సూచీ (AQI) 300లుగా నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

Advertisement