అక్షరటుడే, ఆర్మూర్: దేశాభివృద్ధి, రక్షణ కోసం మోదీ పాలన అవసరమని.. ఈ పార్లమెంట్ ఎన్నికలు దేశానికి ఎంతో కీలకమైనవని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆర్మూర్ మండలం మంథని గ్రామంలో ఛాయ్ పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులు, యువకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ముచ్చటించారు. మోదీ పదేళ్లలో చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు, దేశ రక్షణపై చర్చించారు. మోదీ మూడోసారి ప్రధాని అయ్యేలా అరవింద్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఆర్మూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ కంచెట్టి గంగాధర్, మంథని గ్రామ బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.